ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNPA: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోయి ఆర్థిక భారంతో సతమతమవుతున్న వ్యాపారులకు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఎగుమతి కంటైనర్ల కోసం భారీగా ఛార్జీల మినహాయింపును ప్రకటించింది. నిలిచిపోయిన కంటైనర్లపై గ్రౌండ్ రెంట్, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలను రద్దు చేస్తూ ట్రేడ్ నోటీసు విడుదల చేసింది.
READ ALSO: Union Cabinet Decisions : అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Also Read
- Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
ప్రత్యేక చర్యలు ఇవే..
పోర్ట్, టెర్మినల్ ఆపరేటర్లు ఎగుమతి-దిగుమతి (EXIM) రంగానికి వెసులుబాటు కల్పించేందుకు ఈ క్రింది చర్యలు చేపట్టారు.
* స్టోరేజ్ సౌకర్యం: సరుకు రవాణా అయ్యే వరకు నిలిచిపోయిన కంటైనర్లను టెర్మినల్ యార్డుల్లోనే భద్రపరిచే అవకాశం.
* కస్టమ్స్ సంప్రదింపులు: ఇతర పోర్టుల నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లాల్సిన కంటైనర్లను తాత్కాలికంగా JNPA టెర్మినల్స్‌లో నిల్వ చేసేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చలు.
* అదనపు స్థలం: అదనపు సరుకును ఉంచడానికి టెర్మినల్ ఆపరేటర్లకు మరికొంత స్థలాన్ని కేటాయించిన JNPA.
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారుల కోసం ప్రకటించిన రాయితీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 28, 2026 నుంచి మార్చి 8వ తేదీ ఉదయం వరకు టెర్మినల్స్‌లోకి చేరిన కంటైనర్లపై 15 రోజుల పాటు (మార్చి 14 వరకు) 100% గ్రౌండ్ రెంట్ మినహాయింపు ఇచ్చారు. త్వరగా పాడైపోయే వస్తువులు ఉన్న కంటైనర్ల విద్యుత్ ఛార్జీలలో 80% మినహాయింపు లభిస్తుంది. ఇది కూడా 15 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ రాయితీల వల్ల కలిగే ప్రయోజనం నేరుగా అసలు ఎగుమతిదారులకు అందేలా చూడాలని షిప్పింగ్ లైన్లు, ఫ్రైట్ ఫార్వార్డర్లను JNPA ఆదేశించింది. మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఎదురైన భారాన్ని తగ్గించేందుకు JNPA తీసుకున్న ఈ నిర్ణయం ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Jawaharlal Nehru Port Authority issues Trade Notice |JNPA have decided to offer waiver on charges like ground rent and reefer plug-in charges to the stranded export containers.
The following measures have already being taken by the Port and Terminal Operators to give relief to… pic.twitter.com/6ZLuuoSK0o
— ANI (@ANI) March 10, 2026
READ ALSO: Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!