SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
- 'వారణాసి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి
- వారణాసి తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏది
- రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will SS Rajamouli’s next film with Allu Arjun: దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు రూ.1,300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి.. 2027 ఏప్రిల్ 7న వారణాసి చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇలాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏది?, హీరో ఎవరు? అనే చర్చ ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ప్రారంభమైంది. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా.. గతంలో ఎస్ఎస్ రాజమౌళి చేసిన సినిమాల లెక్కను పరిశీలిస్తే, తదుపరి ప్రాజెక్ట్‌లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి.. అల్లు అర్జున్‌తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. గత కొన్నేళ్లుగా ఈ క్రేజీ కాంబినేషన్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
‘పుష్ప’ సిరీస్‌తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తనదైన నటన, స్టైల్, డ్యాన్స్‌లు, మేనరిజంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన వరుస భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ చిత్రానికి సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజమౌళి-అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే.. అది భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి విజన్‌కు అల్లు అర్జున్ ఎనర్జీ, పాన్ ఇండియా క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాజమౌళి ‘వారణాసి’ పూర్తయ్యాక తన తదుపరి సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!