Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గోల్డెన్ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix: ఒక మంచి కథను సరైన వేదికపైకి తీసుకెళ్లే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే రచయితలకు తమ స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వరకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. రైటర్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి రచయితల కోసం ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘Netflix NextGen India Writers Program’ పేరుతో కొత్త తరం రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. భారతదేశంలో టాలెంట్ రైటర్లను గుర్తించి, వారికి అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. వినూత్న కథనం, ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉంటే చాలు.. మీ ప్రతిభను నేరుగా నెట్‌ఫ్లిక్స్ బృందానికి చూపించే అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా లభిస్తుంది. ఇప్పటివరకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది యువ రచయితలకు ఇది కెరీర్‌ను మలుపు తిప్పే అవకాశంగా మారే అవకాశం ఉంది.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సినీ పరిశ్రమలో లేదా స్క్రీన్ రైటింగ్ రంగంలో గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు అనుభవం ఉండాలి. మీ దగ్గర బలమైన కథ, వినూత్న ఆలోచన ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఎంపికైన వారికి నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిపుణుల నుంచి కథను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణతో భారతీయ కథలకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశం నలుమూలల నుంచి కొత్త కథలను వెలికితీసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ భాషల్లోనూ వినూత్న కథలకు మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో, తెలుగు సహా భారతీయ భాషల రచయితలకు కూడా ఇది గొప్ప అవకాశం కావొచ్చు. మీ కథను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై మీ పేరు కనిపించాలని కలలు కంటున్న ప్రతి రచయిత సినీ ప్రయాణానికి ‘Netflix NextGen India Writers Program’ తొలి అడుగు కావచ్చు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!