Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Jalebi Recipe: వర్షాకాలంలో వేడి వేడి జలేబీ తినడం అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఆనందం. బయట కరకరలాడుతూ, లోపల తియ్యటి పాకంతో నిండిన జ్యూసీ జలేబీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన మిఠాయి. మార్కెట్లో సులభంగా దొరికే ఈ స్వీట్‌ను ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. సరైన పద్ధతి పాటిస్తే కరకరలాడే, రసవంతమైన జలేబీలు మీ ఇంట్లోనే సిద్ధమవుతాయి.
జలేబీకి కావాల్సిన పదార్థాలు
పాకం కోసం
* 1 కప్పు చక్కెర
* ¾ కప్పు నీరు
* సగం నిమ్మకాయ రసం
* ½ టీస్పూన్ కుంకుమపువ్వు
Also Read
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే 'సన్న కారపూస'.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
- Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
- Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
యీస్ట్ జలేబీ కోసం
* 1 కప్పు మైదా
* ½ టీస్పూన్ యీస్ట్
* 2 టీస్పూన్లు శనగపిండి
* ½ కప్పు నీరు
* వేయించడానికి నెయ్యి లేదా నూనె
ఇన్స్టంట్ జలేబీ కోసం
* 1 కప్పు మైదా
* ¼ కప్పు పెరుగు
* 1 టీస్పూన్ వెనిగర్
* ½ టీస్పూన్ బేకింగ్ పౌడర్
* ½ కప్పు నీరు
* వేయించడానికి నెయ్యి లేదా నూనె
జలేబీ పిండి తయారీ
యీస్ట్ పద్ధతి: మైదా, యీస్ట్, శనగపిండి, నీటిని కలిపి చిక్కటి పిండిలా తయారు చేయాలి. దీన్ని మూతపెట్టి 6 నుంచి 7 గంటలు పులియనివ్వాలి. తర్వాత మరోసారి బాగా కలపాలి.
ఇన్స్టంట్ పద్ధతి: మైదా, పెరుగు, వెనిగర్, బేకింగ్ పౌడర్‌ను కలిపి 5 నుంచి 7 నిమిషాలు పక్కన పెట్టాలి. అనంతరం నీరు కలిపి ఉండలు లేకుండా మృదువైన పిండిలా తయారు చేసి రెండు నిమిషాలు బాగా గిలకొట్టాలి.
పాకం తయారీ
ఒక పాత్రలో చక్కెర, నీరు వేసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత నిమ్మరసం కలపాలి. తీగ పాకం వచ్చేవరకు ఉడికించి చివరగా కుంకుమపువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
జలేబీ తయారీ విధానం
సిద్ధమైన పిండిని పైపింగ్ బ్యాగ్ లేదా సాస్ బాటిల్లో నింపాలి. కడాయిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మధ్యస్థ మంటపై గుండ్రంగా జలేబీలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వెంటనే వాటిని వేడి పాకంలో 3 నుంచి 4 నిమిషాలు నానబెట్టి బయటకు తీసి వడ్డించాలి. ఇంట్లో తయారుచేసిన ఈ కరకరలాడే, రసవంతమైన జలేబీని వేడి టీ లేదా రబ్రీతో తింటే రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఈ వర్షాకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ స్వీట్‌ను ఆస్వాదించండి.
తాజావార్తలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!