Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jmm Announces Hemant Soren Sister Anjani As Its Lok Sabha Candidate From Odisha Mayurbhanj

Hemant Soren: మయూర్‌భంజ్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ సీఎం సోదరి పోటీ

Published Date :May 2, 2024 , 12:57 pm
By Suresh Maddala
Hemant Soren: మయూర్‌భంజ్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ సీఎం సోదరి పోటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరి అంజనీని జేఎంఎం ప్రకటించింది. అంజనీ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె. మయూర్‌భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నాబా చరణ్ మాఝీని రంగంలోకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో బిశేశ్వర్ తుడు విజయం సాధించారు. ఇప్పుడు నాబా చరణ్ మాఝీకి బీజేపీ అవకాశం కల్పించింది.

ఇది కూడా చదవండి: Ponguleti: కరెంటుని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నావు.. కేసీఆర్‌ పై పొంగులేటి ఫైర్

ఇదే స్థానం నుంచి సుదమ్ మరాండీ బీజేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. సుదామ్ మరాండి ఒకప్పుడు ఒడిశాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేతగా ఉన్నారు. అనంతరం అతను బీజేడీలో చేరారు. సుదామ్ మరాండీకి స్థానికంగా ప్రజల మద్దతు ఉందనే మాట వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి జేఎంఎం తరపున అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ లోక్‌సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది. మయూర్‌భంజ్ జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. 2019లో అంజనీ సోరెన్ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానంలో గిరిజనుల సంఖ్య అత్యధికం. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. జేఎంఎంతో పొత్తు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.

ఇది కూడా చదవండి: Pushpa2 Rights : ఇండియా అయినా అమెరికా అయినా పుష్ప గాడు దిగనంతవరకే..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25న ఓటింగ్ జరగనుంది. మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hemant soren
  • JMM announces
  • Lok sabha candidate
  • Lok Sabha Election 2024
  • Mayurbhanj

తాజావార్తలు

  • PM Modi: ఆత్మనిర్భర దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మోడీ వెల్లడి

  • Tragedy: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు ఘోరం..

  • CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

  • DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!

  • Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోలు వైరల్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions