Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
- డేటా అవసరం లేని వినియోగదారుల కోసం..
- జియో, ఎయిర్టెల్, వీఐ ప్రత్యేక వాయిస్ ఓన్లీ ప్లాన్స్
- తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకునేవారికి జియో బెస్ట్ ఆప్షన్
- ఏడాది మొత్తం వ్యాలిడిటీ కోరుకునేవారికి ఎయిర్టెల్, వీఐ ప్లాన్లు బెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio vs Airtel vs Vi: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి ఇంటర్నెట్ డేటా అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా.. ఫీచర్ ఫోన్ ఉన్న వినియోగదారులు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపుకోవడానికి మాత్రమే మొబైల్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని TRAI విధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకవచాయి. ఈ ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాల్స్, నిర్ణీత సంఖ్యలో SMSలు లభిస్తాయి. అయితే వీటిలో ఎలాంటి డేటా ప్రయోజనం మాత్రం లభించదు.
జియో (JIO)
జియోలో రూ.147తో ప్రారంభమయ్యే ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో 300 SMSలను అందిస్తుంది. ఆపై రూ.177 ప్లాన్‌తో 28 రోజులు, రూ.196 ప్లాన్‌తో 30 రోజులు, రూ.197 ప్లాన్‌తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ లభిస్తుంది. వీటిలో 300 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇక రూ.448 ప్లాన్‌తో 84 రోజులు, 1,000 SMSలు పొందవచ్చు. ఏడాది తరహా వినియోగం కోసం రూ.1,748 ప్లాన్ ఉండగా.. 336 రోజుల వ్యాలిడిటీతో 3,600 SMSలు లభిస్తాయి.
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ఎయిర్టెల్ (AIRTEL)
ఎయిర్‌టెల్‌లో రూ.185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 300 SMSలను అందిస్తుంది. రూ.203 ప్లాన్‌తో 30 రోజులు, రూ.206 ప్లాన్‌తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ 300 SMSలు ఉంటాయి. అలాగే రూ.469 రీఛార్జ్‌తో 84 రోజులు, 900 SMSలు పొందవచ్చు. ఇక రూ.1,849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, 3,600 SMSలు లభిస్తాయి.
వీఐ (Vi)
వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ తరహాలోనే ప్లాన్లను అందిస్తోంది. రూ.185తో 28 రోజులు, రూ.203తో 30 రోజులు, రూ.206తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లలో 300 SMSలు ఉంటాయి. రూ.470 ప్లాన్‌తో 84 రోజులు, 900 SMSలు పొందవచ్చు. రూ.1,849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, 3,600 SMSలు లభిస్తాయి.
ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్?
ధరల పరంగా చూస్తే స్వల్పకాలిక రీఛార్జ్‌లతో పాటు 84 రోజుల ప్లాన్‌లోనూ జియో తక్కువ ధరకు సేవలను అందిస్తోంది. ముఖ్యంగా 84 రోజుల వ్యాలిడిటీకి జియో రూ.448 మాత్రమే వసూలు చేస్తుండగా.. ఎయిర్టెల్ రూ.469, వీఐ రూ.470 చొప్పున వసూలు చేస్తున్నాయి. అయితే ఏడాది ప్లాన్ విషయానికి వస్తే.. ఎయిర్టెల్, వీఐ రూ.1,849తో 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుండగా, జియో రూ.1,748తో 336 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తోంది. మొత్తంగా చూస్తే తక్కువ ధరకు రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి జియో మంచి ఎంపిక. ఏడాది మొత్తం వ్యాలిడిటీ కోరుకునేవారు ఎయిర్టెల్, వీఐ ప్లాన్లను పరిశీలించవచ్చు. ముఖ్యంగా రెండో సిమ్ ఉపయోగించేవారికి, ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం కాల్స్ చేసుకునే తల్లిదండ్రులు, వృద్ధులకు ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి.
తాజావార్తలు
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..