Jio Bharat J1 4G phone: ఓవైపు భారీ ఎత్తున చార్జీలు పెంచారంటూ.. కొంతమంది యూజర్లు జియో నెట్‌వర్క్‌కు గుడ్‌బై చెబుతున్న వేళ.. మార్కెట్‌లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది జియో.. జియో భారత్ జే1 4జీ పేరుతో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది 4జీ కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్.. జియో భారత్ ప్లాన్‌కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది జియో… ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్.. భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇప్పుడు ఆ సంస్థ కొత్త 4జీ జియో ఫోన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ బేసిక్ ఫోన్ వినియోగదారులను 4జీ వైపు ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది జియో… ఆ సంస్థ ఇప్పటికే జియో బటన్ మోడల్ మొబైల్‌లలో యూపీఐ, జియో సినిమా.. ఓటీడీ సహా పలు సేవలను అందిస్తోంది. రిలయన్స్ జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్‌ను ఇప్పుడు అమెజాన్‌లో విడుదల చేసింది.
Read Also: Olympics: “ముద్దు” వివాదంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు.. క్రీడా మంత్రి, మక్రాన్ కిస్‌పై రగడ..
జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలను జియో విడుదల చేసింది. గతంలో జియో భారత్ పి2, జియో భారత్ కె1 కార్బన్‌లు 4జీ మోడళ్లను విడుదల చేశాయి. ఈ సందర్భంలో, జియో యొక్క కొత్త ఫీచర్ ఫోన్ 2.8-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో జియో మనీ, సినిమా ఓటీటీ, హెచ్‌డీ కాలింగ్, యూపీఐ చెల్లింపు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌లో సేల్స్ ప్రారంభించిన జియో ఫోన్ ధర ప్రస్తుతం రూ.1799 వద్ద జాబితా చేయబడింది. 2.8-అంగుళాల స్క్రీన్‌తో, ఈ ఫోన్ టచ్ ద్వారా పనిచేస్తోంది.. 2500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. హెడ్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం జాక్ అందించబడింది.
Read Also: Olympics: “ముద్దు” వివాదంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు.. క్రీడా మంత్రి, మక్రాన్ కిస్‌పై రగడ..
ఇక, ఫోన్‌లో 0.3 మెగాపిక్సెల్ కెమెరా, ఎఫ్‌ఎం రేడియో మరియు 128 జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉన్నాయి. మీరు జియో మనీ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. హెచ్‌డీ క్వాలిటీతో కాల్స్ చేయడానికి కూడా ఈ ఫోన్‌ని ఉపయోగించవచ్చు. మీరు జియో సినిమా ద్వారా 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లను కూడా చూడవచ్చు. అయితే, జియో నుండి వచ్చిన ఈ కొత్త ఫోన్ జియో నెట్‌వర్క్‌లో మాత్రమే పని చేస్తుంది. ఇతర సిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేయదు.. అలాగే, ఫోన్ 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 4G VoLTE సదుపాయాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇక, జియో ఈ ఫోన్‌తో రూ. 123 విలువైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. దీని ద్వారా సదరు కస్టమర్ 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడవచ్చు.. అదేవిధఃగా 14 జీబీ డేటాను కూడా పొందవచ్చు.