NTV Telugu Site icon

Jeevan Reddy : ఎమ్మెల్సీగా నా బాధ్యత కర్తవ్యం నెరవేరేవేర్చిన సంతృప్తి ఉంది

Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు. ఎమ్మెల్సీ గా నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చిన సంతృప్తి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడిగా అత్యధిక సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన అని, సిట్టింగ్ ఎమ్మెల్సీ గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించడం సహజమని, అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు , ఎంపీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ గెలుపొందడం నిరాశ కు గురిచేయడంతో ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదన్నారు. ఉత్తర తెలంగాణ విద్యా వేత్త నరేందర్ రెడ్డి.. పరిచయం అవరసం లేని వ్యక్తి అని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో అర్హత కల్పించడం లో లక్ష మందిని తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డి కి దక్కుతుందన్నారు జీవన్‌ రెడ్డి.

Donald Trump: ఉక్రెయిన్ ‘‘అరుదైన లోహాల’’పై ట్రంప్ కన్ను.. అమెరికాకి పుతిన్ ఆఫర్..

తెలంగాణ ఉద్యమం నిధులు, నీళ్ళు, నియామకాల కోసం కొనసాగిందని, ఉద్యమ సారథిగా కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులు మార్పులు కోరడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఒక సంవత్సర కాలంలో 56 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు జీవన్‌ రెడ్డి. మూడేళ్ళలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేసినం అని ప్రచారం చేసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. 2008 డీఎస్సీ కోర్టు ఉత్తర్వులు వచ్చిన గత ప్రభుత్వం అమలు చేయలేదని, ఉద్యోగాల ఖాళీల భర్తీ కి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్నారు జీవన్‌ రెడ్డి. అంతేకాకుండా.. స్వయం ఉపాధి తో పాటు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఉద్యోగాల నైపుణ్య పెంపు కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రశ్నించే గొంతుగ మారిన. పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని నరేందర్ రెడ్డి అవవకాశం కల్పించారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలి. నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ హైకమండ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన నరేందర్ రెడ్డి గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలి. యువతను ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందజేశారు. గతంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనం ఇవ్వడంలో జాప్యం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నాం. పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా జీవన్ రెడ్డి నీ గెలిపించారు అని గుర్తు చేశారు. బీ ఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి, పట్టభద్రుల పక్షాన నిలిచారు. జీవన్ రెడ్డి స్థానంలో నరేందర్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన నేపథ్యంలో కరీంనగర్ ముద్దు బిడ్డ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని’ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

SLBC Incident: క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..