Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు.…
ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. దీనిపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కే. రామకృష్ణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ కే. సత్యగోపాల్‌తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్. ఫిర్యాదు చేసినప్పటికీ ఫార్మా…