నేడు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుంభకోణం జరుగుతుంది. రూ. 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక దీపం సీరియల్ లాగ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ కుంభకోణం జరుగుతుందని మాట్లాడారు. ఇక ‘ఆర్ఆర్’ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు.
Also read: Hardik Pandya: తనకు హార్దిక్ పాండ్యాపై అనుమానం ఉందంటున్న మాజీ ఆటగాడు..!
రేవంత్ రెడ్డిది స్కీమ్ ల పాలన కాదు, స్కాంల పాలన అంటూ.. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది., ఇచ్చిన డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మా పార్టీ హయంలో వడ్లను ఎక్స్ పోర్ట్ చేస్తే.. రేవంత్ రెడ్డి హయాంలో డబ్బులను ఎక్స్ పోర్ట్ జరుగుహుందని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన వడ్ల కొనుగోలులో జరిగిన అవినీతి పై ఈడి, సిబిఐకి పిర్యాదు చేస్తానని.. నేను ఏం మాట్లాడిన నా పై కేసులు పెడుతున్నారు, అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు.
Also read: Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ
వీటితోపాటు కేంద్రంలో ఈడి ట్యాపింగ్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ ప్రభుత్వంపై చురుకు అంటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారీ బిఆర్ఎస్ పార్టీ 17కు 17స్థానాలు గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక తనని కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని., నా మీదా 7 కేసులు పెట్టారని.. నన్ను బెదిరించి నా ఇల్లు కూలగొట్టి.. కరెంట్ కట్ చేశారని ఆయన వాపోయాడు.