Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Jeevan Reddy Brs Joining News Ktr Return Opposing Leaders Silent Reason

OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

Published Date :April 6, 2026 , 10:22 pm
By Shiva Ganesh
  • ఆయన వస్తానంటే...కొందరు వద్దన్నారు
  • ఇప్పుడా నేతల మౌనవ్రతం
  • చూసీ చూడనట్టుగా, వినీ విననట్టుగా నోటికి తాళం
  • హైకమాండ్ పెద్దలంటే భయమా...వారిచ్చిన అభయమా?
  • అధిష్టానం ఎలాంటి మంత్రంతో వారిని సైలెంట్ చేసింది?
  • విదేశాల నుంచి కేటీఆర్ రాగానే జీవన్ రెడ్డి కారెక్కుతారా?
  • జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్లో కొందరు నేతలు వ్యతిరేకించారా?
  • పెద్ద పదవుల తర్వాత జీవన్ రెడ్డి సైతం పార్టీని వదిలేస్తారని నేతల డౌట్స్
  • అధిష్టానం బుజ్జగించిందా?
  • భయపెట్టిందా...అభయమిచ్చిందా?
  • జీవన్ రెడ్డిని వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు?
OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విదేశీ పర్యటనలో వున్న కేటీఆర్….హైదరాబాద్కు రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కారెక్కుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అటు జీవన్ రెడ్డి వర్గం, ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయాన్ని బలపరచకపోయినా….ఆయన గులాబీ తోటలోకి చేరడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారం మొదలైన మొదట్లో…. జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్ లో కొందరు నేతలు వ్యతిరేకించారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా ఎల్.రమణ, గంగుల కమలాకర్… జీవన్ రెడ్డిని చేర్చుకోవద్దని అధిష్టానానికి పదేపదే విన్నవించారన్న గుసగుసలు అన్నీ ఇన్నీ కావు. జీవన్ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకుంటే మరో కే.కేశవ రావు, డి.శ్రీనివాస్ అవుతారని అన్నారట. అలాంటి వారిని తీసుకుని, పెద్దపెద్ద పదవులు కట్టబెట్టినా సరే చివరకు వారు బీఆర్ఎస్ను వదిలి వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట. జీవన్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారట. ఇలా జీవన్ రెడ్డి రాకను ఇంతెత్తున వ్యతిరేకించిన నేతలు….ఆల్ ఆఫ్ సడెన్గా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వారి బుజ్జగించిందా….భయపెట్టిందా…అభయమిచ్చిందా అనే డిస్కషన్ హాట్హాట్గా సాగుతోంది. వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారన్న డిస్కషన్ వాడివాడిగా సాగుతోంది.

READ ALSO: Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకు ఉన్న ఇమేజ్ పార్టీకి కలిసొస్తుందని నేతలకు సర్ది చెబుతోందట గులాబీ అధిష్టానం. ముఖ్యంగా జీవన్ రెడ్డి కారెక్కితే తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఎల్.రమణ, గంగుల వంటి నేతలకు అనేక సమీకరణాలు వివరిస్తోందట. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కూడా జరగబోతుందని అభయమిస్తోందట. ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉత్తర తెలంగాణలో కూడా చాలా శాసనసభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జీవన్ రెడ్డిని ఏదో ఒక నియోజకవర్గంలో సెట్ చేయవచ్చని చెబుతున్నారట. జీవన్ రెడ్డి వచ్చినంత మాత్రాన పాత నేతలకు ఇబ్బంది కలగదు అని మాట ఇస్తున్నారట అధిష్టానం పెద్దలు. ఎమ్మెల్యే సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ మంత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కొత్త ఆశలు చెబుతోందట. జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నా మిగతా సీనియర్లకు కూడా కేబినెట్ బెర్తుల్లో ఢోకా వుండదని ధైర్యం చెబుతున్నారట. ఇలా నియోజకవర్గాల పునర్విభజన మంత్రంతో బీఆర్ఎస్ హైకమాండ్ జీవన్ రెడ్డి చేరిక అంశాన్ని సరళతరం చేసుకుంది. జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాతవారికి ప్రాధాన్యత తగ్గదని ఉదాహరణలతో సహా చెబుతోంది. హైకమాండ్ భరోసాతో వస్తేరాని…. పోతేపోని అన్నట్టుగా మౌనంలోకి జారుకున్నారట సదరు నాయకులు.

READ ALSO: PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Internal Politics Karimnagar
  • Congress Resignation Jeevan Reddy
  • Gangula Kamalakar vs Jeevan Reddy
  • Jeevan Reddy Joining BRS
  • KTR Hyderabad Return Jeevan Reddy

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions