హసన్ మాజీ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. పని మనిషిపై అత్యాచారం కేసులో గతేడాది ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు ప్రజ్వల్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులిచ్చింది.
సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యంతరకర వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జేడీఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ పార్లమెంట్ సిటింగ్ ఎంపీ, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న అశ్లీల పెన్‌డ్రైవ్ ఆరోపణలపై కర్ణాటక సర్కార్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది.