కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు..పొన్నియిన్ సెల్వన్’ మరియు ‘ఇరైవన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో జయం రవి. వరుస సక్సెస్ లు అందుకుంటు వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా ను అనౌన్స్ చేశాడు.జయం రవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరన్’.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్ మరియు సైరన్ ప్రీఫేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా కు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.దీపావళి పండగ కానుక గా సైరన్ నుంచి మేకర్స్ టీజర్ ను విడుదల చేసారు…
కీర్తి సురేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగిన ఈ టీజర్‌లో జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గా కనిపిస్తాడు..జయం రవి జైలు నుంచి విడుదలైన అనంతరం తన ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లు గా టీజర్ ఉంది. ఇక ఈ ప్రోమోలో జయం రవి రగ్గడ్ లుక్ లో ఎంతగానో అలరించాడు. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది.ఈ చిత్రం లో జయం రవి, కీర్తి సురేష్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా కనిపించునుంది. అలాగే ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, తులసి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.. సెల్వ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు… సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది..