ఈరోజుల్లో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సినిమాలు అన్ని ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఇక్కడ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటిది యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అధిక వ్యూస్ ను సాధించడం గమనార్హం.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా ఇటీవల హిందీలోకి డబ్ అయింది.. తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వని ఈ సినిమాకు హిందీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు.. వ్యూస్ తో దూసుకుపోతుంది..
హింది వర్షన్ తో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా ఇదే .. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న పెస్ స్టూడియోస్ ప్రకటించింది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో.. ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు అయిన.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించారు..
ఈ సినిమా 2017 లో రిలీజ్ అయింది. అలాగే సినిమా టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ అందుకొని తెలుగు ప్రేక్షకుల అభిమాన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డులను బద్దలు కొడుతుంది.. రోజు రోజుకు వ్యూస్ పెరుగుతున్నాయి.. ఇన్నాళ్లకు ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది..