JayaPrakash Narayana: ఏపీలో రెడ్లకు కమ్మ- కాపుల మధ్య పోరాటం.. రాష్ట్రాన్ని కులాల క్షేత్రంగా మార్చకండి..
వైసీపీ ఒకవైపు టీడీపీ- జనసేన- బీజేపీ మరోవైపు పోటీ పడుతున్నాయని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో రెడ్లకు కమ్మ – కాపుల మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోంది.. మంచి పాలన అంటే కేవలం సంక్షేమం అని ఒక పార్టీ భావిస్తోంది.. అప్పులు తెచ్చి సగం జీత భత్యాలకు, మరికొంత కైంకర్యం చేసి, కొంత దుబారా చేసి, మిగిలాగా సంక్షేమానికి పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. దేశ సమాజంలో సంక్షేమం అవసరమే కానీ.. దానికి పరిమితం ఉండాలి కదా అని ప్రశ్నించారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే.. ఆ దేశం, రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయం అన్నారు. మనకి ఇప్పుడు నడుస్తుంటే కాదు.. మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలి అని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.
Read Also: PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
సంక్షేమం అంటేనే.. వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుంది.. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపే వారికే పట్టం కట్టండి అని పిలుపునిచ్చారు. ఏపీని కులాల క్షేత్రంగా మార్చకండని మొత్తుకుంటున్నా.. ఎవరూ వినడం లేదు అని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని తెలిపారు. ఇక, రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసు.. అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యనించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!