Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Shah: 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లాండ్‌లో ఆదివారం (జూన్ 7)న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జయ్ షా.. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు టోర్నీలో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు.
కార్యక్రమం సందర్భంగా జై షా అన్ని జట్ల కెప్టెన్లను కలిసి అభినందించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో ఆయన హ్యాండ్‌షేక్ చేయడం కెమెరాల్లో చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై భారత, పాకిస్థాన్ అభిమానులు భిన్నంగా స్పందించారు. కొందరు పాకిస్థాన్ అభిమానులు గతంలో భారత క్రికెట్ జట్టు అనుసరించిన ‘నో హ్యాండ్‌షేక్’ విధానాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం.. జై షా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నందున అన్ని జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
గతంలో భారత్, పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య హ్యాండ్‌షేక్ అంశం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో అధికారిక కార్యక్రమాల్లో దూరంగా ఉండటం వార్తల్లో నిలిచింది. ఆ నేపథ్యంలో జై షా చేసిన ఈ కరచాలనం మరోసారి చర్చకు కారణమైంది. ఇదిలా ఉంటే.. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12న ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. కాగా, గత ఎడిషన్ విజేతలైన న్యూజిలాండ్ మహిళల జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!