Jasprit Bumrah Injury: ఇంగ్లండ్‌తో సిరీస్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
- జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన
- ఐదు టెస్టుల్లో 32 వికెట్స్
- ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా అనుమానమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో టీమిండియా తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల్లో 32 వికెట్స్ పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అయితే వెన్ను గాయం కారణంగా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 150కి పైగా ఓవర్లు వేశాడు. ఎక్కువ పనిభారమే అతడి వెన్ను నొప్పికి కారణమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లోని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. బుమ్రాకు తగిన విశ్రాంతిని ఇచ్చి.. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి తాజాగా ఉంచాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అతడిని సిద్ధం చేయడానికి బీసీసీఐ వైద్య బృందం కసరత్తులు చేస్తోంది. ఎందుకంటే ఛాంపియన్స్ టోర్నీలో టీమిండియాకు బుమ్రా ఎంతో కీలకం. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతను బీసీసీఐ వైద్య బృందం ఇంకా అంచనా వేయలేదని తెలుస్తోంది. గాయం గ్రేడ్ 1 విభాగంలో ఉంటే కోలుకోవడానికి కనీసం 2, 3 వారాలు పడుతుంది. గ్రేడ్ 2 అయితే 6 వారాలు పట్టొచ్చు. ఇక గ్రేడ్ 3 అయితే మాత్రం విశ్రాంతి, పునరావాస కార్యక్రమానికి దాదాపుగా మూడు నెలల సమయం పడుతుంది. బుమ్రాకు అయిన గాయం తీవ్రత ఆధారంగా అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడా అన్నది తేలనుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 22న టీ20 సిరీస్ మొదలవుతుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!