Rats Eat Ganja: పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్ పోలీసుల నివేదిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు స్టేషన్‌లో నిల్వ ఉంచిన మత్తు పదార్థాలను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేశాయని అధికారి తన నివేదికలో తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్‌లో నివేదిక కూడా నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Also read: Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!
Also Read
డిసెంబర్ 14, 2018న, రాజ్‌గంజ్ పోలీసులు 10 కిలోల భాంగ్, 9 కిలోల గంజాయితో శంభుప్రసాద్ అగర్వాల్ తోపాటు అతని కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. విచారణ సందర్భంగా., జప్తు చేసిన భాంగ్, గంజాయిని ఏప్రిల్ 6న కోర్టులో హాజరుపరచాలని కేసు దర్యాప్తు అధికారి జయప్రకాష్ ప్రసాద్‌ను కోర్టు ఆదేశించింది.
Also read: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..
కాకపోతే ఇందుకు గాను “జప్తు చేసిన వస్తువులన్నింటినీ ఎలుకలు ధ్వంసం చేశాయని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ దరఖాస్తుతో ప్రసాద్ శనివారం కోర్టుకు హాజరయ్యారు” అని ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అభయ్ భట్ మీడియాకు తెలిపారు. జప్తు చేసిన వస్తువులను పోలీసులు ప్రదర్శించలేనందున, తన క్లయింట్ ను తప్పుడు కేసుల్లో ఇరికించినట్లు కనిపిస్తోందని భట్ అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!