Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Japan Rising Anti Muslim Sentiment Mosque Growth Political Debate 2026

Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..

Published Date :April 17, 2026 , 2:45 pm
By RAMAKRISHNA KENCHE
Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Muslim Population: జపాన్ అంటే క్రమశిక్షణకు, సంస్కృతికి మారుపేరుగా చెబుతుంటారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం జపాన్. అయితే, ఇటీవలి కాలంలో అక్కడ ముస్లిం వ్యతిరేక భావజాలం బలంగా వినిపిస్తోంది. ఆ దేశంలో గడిచిన కొన్నేళ్లలో భారీగా మజీదులు భారీగా పెరిగాయట. మొదట్లో కేవలం నాలుగు మజీదులు ఉండగా.. చివరకు 160కు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘మసీదుల నిర్మాణం’, ‘కబరస్థాన్ల ఏర్పాటు’ వంటి అంశాలు ప్రధాన ఎన్నికల అజెండాలుగా మారడం గందరగోళంగా మారింది. టోక్యో సమీపంలోని యోకోహామా, ఫుజిసావా వంటి ప్రాంతాల్లో మసీదుల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. జనవరి 29న ఫుజిసావా స్టేషన్ వెలుపల ఒక స్వతంత్ర అభ్యర్థి చేసిన ప్రసంగం దీనికి ఆజ్యం పోసింది. మసీదుల నిర్మాణం వల్ల జపాన్ సాంస్కృతిక అస్తిత్వం దెబ్బతింటుందని, స్థానిక ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వస్తున్న ప్రచారం జపాన్ ప్రజల్లో ఇన్ సెక్యూరిటీని పెంచుతోంది. జపాన్ ప్రజల ఆందోళనకు ప్రధాన కారణం.. ఒక దశాబ్ద కాలంలోనే ముస్లిం జనాభా అనూహ్యంగా పెరగడమే అని చెబుతున్నారు. 2010 జనాభా లెక్కల ప్రకారం.. జపాన్‌లో కేవలం 1,10,000గా ఉన్న ముస్లింల సంఖ్య, 2024 నాటికి సుమారు 4,20,000కు చేరిందని నిపుణుడు హిరోఫుమి తనడా అంచనా వేశారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇక 1980లో కేవలం 4 మసీదులు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 160కి చేరిందట. దాదాపు 54,000 మంది జపనీయులు ఇస్లాం మతాన్ని స్వీకరించడం కూడా స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

READ MORE: Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?

జపాన్ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన సనా తకైచీ, ఆమె పార్టీ అనుసరిస్తున్న మితవాద (Right-wing) విధానాలు ఈ పరిస్థితిని మరింత ప్రభావితం చేస్తున్నాయి. జపాన్‌లో విదేశీ జనాభా పెరగడం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తకైచీ సమర్థవంతంగా వినియోగించుకున్నారు. జనవరిలో ఆమె ప్రభుత్వం పౌరసత్వం, శాశ్వత నివాసానికి (PR) సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిలు ఉన్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో ‘హలాల్ ఫుడ్’ అందించాలనే ప్రతిపాదనలపై వేలాది ఫిర్యాదులు రావడం, జపాన్ మూల సంస్కృతిని కాపాడుకోవాలనే తపన జపనీయుల్లో తీవ్రమైంది. తగ్గుతున్న జననాల రేటు కారణంగా జపాన్‌కు విదేశీ కార్మికుల అవసరం ఉన్నప్పటికీ, పెరుగుతున్న విదేశీ జనాభా తమ సంస్కృతిని మార్చేస్తోందన్న భయం జపనీయులను వెంటాడుతోంది. ముఖ్యంగా ఇండోనేషియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వస్తున్న వలసదారుల సంఖ్య పెరగడం, మసీదుల నిర్మాణం ద్వారా అది ఒక భౌగోళిక మార్పుకు దారితీస్తోందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఈ ‘కల్చరల్ క్లాష్’ ఇప్పుడు జపాన్ రాజకీయాలను శాసిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cultural identity Japan
  • international news
  • Japan anti Muslim sentiment
  • Japan foreign workers debate
  • Japan immigration issue

తాజావార్తలు

  • Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..

  • Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?

  • YS Jagan Foreign Tour: వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

  • Mrunal Thakur : చుంకీ పాండేకు భార్యగా నటించడంపై మృణాల్ అసంతృప్తి

  • JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!

ట్రెండింగ్‌

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions