Japan 7.6 Earthquake: జపాన్ను వణికించిన భారీ భూకంపం.. వైరల్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan 7.6 Earthquake: జపాన్ ఈశాన్య తీరంలో సోమవారం 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం అమోరి ప్రిఫెక్చర్ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో ఉంది. భూకంపం తర్వాత అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని, ఈశాన్య తీరంలో మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఈ భారీ భూకంపం కారణంగా ప్రాణనష్టం సంభవించినట్లు ఎక్కడ నివేదికలు లేవు.
READ ALSO: కొత్త ఫీచర్లు, 5500mAh రీప్లేసబుల్ బ్యాటరీ, ప్రైవసీ స్విచ్‌తో కొత్త Jolla Phone లాంచ్..!
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
ఈ భారీ భూకంపం కారణంగా ప్రమాదకరమైన సునామీ తరంగాలు జపాన్, రష్యా తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ. పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా విధ్వంసకర అలలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హొక్కైడోకు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈ భారీ భూకంపం వీడియోను కూడా పంచుకున్నాడు.
జపాన్‌లో భూకంపాలు ఎందుకు వస్తాయి..
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మార్చి 2011లో ఇదే ప్రాంతంలో వినాశకరమైన భూకంపం, సునామీ సంభవించి వేలాది మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో సంభవించిన భూకంపం కారణంగా జపాన్‌లో ఎటువంటి పెద్ద నష్టం జరగనప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలందరూ ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.
A Japanese Twitter user from Hokkaido shared this video of the strong earthquake that hit northern Japan. Judging from the time on the TV screen, it was filmed right when the shaking was very strong. The person says it was a "long" earthquake.pic.twitter.com/2FOYyvTBFw https://t.co/1oK1F1ug6x
— Jeffrey J. Hall 🇯🇵🇺🇸 (@mrjeffu) December 8, 2025
READ ALSO: Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!