Job Offer : రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతారు. అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుందని చెబుతుంటారు. అలా అని మరీ ఎక్కువ గంటలు నిద్రపోకూడదు. ఎక్కువ నిద్ర కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది. బాగా నిద్రపోతే గ్లామర్ కూడా పెరుగుతుందని కొంత మంది వాదన. ఈ క్రమంలో జపాన్‌లోని ఓ కంపెనీ నిద్ర ప్రియుల కోసం వెతుకుతోంది. కాల్బీ అనే కంపెనీ నిద్రకు సంబంధించిన పరిశోధనలు చేసేందుకు నిద్ర బాగా పోయే వారి కోసం వెతుకుతోంది. స్లీప్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ అని పిలువబడే పరిశోధన కార్యక్రమంలో పాల్గొనేవారికి జీతం కూడా చెల్లిస్తామంటోంది. నెలవారీ జీతం కూడా భారీగా ముట్టజెప్పుతామంటోంది. అది కూడా 50,000 యెన్ లేదా మన రూపాయల్లో 30,452 అందుకుంటారు. నిద్ర నాణ్యత పెరిగితే జీతం పెరుగుతుందని కంపెనీ పేర్కొంది.
Read Also: Delivery In Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ
పరిశోధనలో భాగమైన వారు తమ ఇళ్లలో పడుకోవచ్చు. ప్రతి రోజు పరిశోధకులు నిద్రపోతున్నప్పుడు వారి మెదడు తరంగాలను రికార్డ్ చేశారు. ఈ డేటా ప్రకారం సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కాల్బీ అనేది న్యూమిన్ అనే స్లీప్ ఎయిడ్ పిల్‌ను అభివృద్ధి చేసిన సంస్థ. కోవిడ్ -19 తర్వాత నిద్రలేమి మరియు ఆందోళనతో బాధపడేవారికి దాని మాత్ర ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్‌లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో, కోవిడ్ తర్వాత ప్రజలలో నిద్రలేమి మరియు ఆందోళన పెరిగాయని పేర్కొంది. పదహారు దేశాలకు చెందిన 13000 మందిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.