స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంది.. ఇక జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని టాక్ ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుంది..ఇక జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కూడా జాన్వీ కపూర్ కి అవకాశం వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ జాన్వీ కపూర్ కి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.కానీ దేవర సినిమాతో ఈ హీరోయిన్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు..
ఇకపోతే గత కొద్దిరోజులుగా జాన్వీ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ విషయం విన్న ఆమె అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఇక జాన్వీ కపూర్ చదువుకున్నప్పటినుండే తనతో ఎంతో స్నేహంగా మెదులుతున్న శిఖర్ పహారియ తో లవ్ లో ఉంది. అయితే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్టీలు, పబ్బులు అంటూ తిరగడమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు.. వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి సంబంధం ఉండటంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.. అయితే వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.. ఆ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..