అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్‌గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని తెలిపింది జాన్వీ. “ఆ సమయంలో నేను ఎదుర్కొన్న వేదన, అనుభవించిన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను.. చెప్పిన అర్థం కాదు. అది పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతి” అని ఆమె చెప్పింది.
Also Read : Naga Vamsi : ఐ బొమ్మ రవి విషయంలో నాగవంశీ సైలెంట్.. భయపడుతున్నాడంటూ నెటిజన్ల కామెంట్స్ !
అలాగే ప్రస్తుత జర్నలిజం, మీడియా సంస్కృతి, సోషల్ మీడియా పబ్లిక్ ఫోకస్ మానవ నైతికతను పూర్తిగా దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాన్ని జాన్వీ వ్యక్తం చేసింది. ప్రముఖులు చనిపోయిన వెంటనే వారి మరణాన్ని మీమ్స్‌గా మార్చే ధోరణి చాలా భయంకరమని ఆమె చెప్పింది..‘‘ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా చాలా మంది చాలా రకాల వార్తలు పుట్టించారు. ఒకరి మరణాన్ని మీమ్‌గా మార్చడం ఎంతో పాపం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. రోజు రోజుకు ఈ పరిస్థితి మరింత దిగజారిపోతోంది” అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం తర్వాత కొద్ది నెలలకే జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తల్లి మరణం తర్వాత మీడియా చూపులు, సోషల్ మీడియా దాడులు, బాధను మీమ్‌లుగా మార్చే సంస్కృతి తమ కుటుంబానికి చాలా కఠినంగా అనిపించిందని ఆమె మరోసారి గుర్తుచేసుకుంది