అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్‌గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని…