ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల శివ చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆచార్య సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో చేసే దేవర సినిమా కోసం కొరటాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి విషయం తానే దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసారు. ఎన్టీఆర్ లుక్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో ఉండనుందని సమాచారం.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ జాన్వికపూర్ నటిస్తుంది. ఆమెకు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు.పక్కా ట్రెడిషనల్ లుక్ లో జాన్వీ కపూర్ కనిపించనుంది. లంగావోణీ లో ఈ అమ్మడి లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది జాన్వీ కపూర్.ఇప్పటివరకు కేవలం మూడు రోజులు మాత్రమే నేను దేవర షూటింగ్ లో పాల్గొన్నాను. సెప్టెంబర్ నుంచి నేను షూటింగ్ లో జాయిన్ అవుతున్నాను.. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కువ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు అని తెలిపింది జాన్వీ.ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.