Janhvi Kapoor Dating: అందుకే సినిమా వాళ్లతో ఎప్పటికీ డేటింగ్ చేయను: జాన్వీ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor Said I never Dating with Actors: సినిమా వాళ్లతో మాత్రం తాను అస్సలు డేటింగ్ చేయను అని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. సినిమాల్లో పనిచేసే వారు ఎప్పుడూ బిజీగా ఉంటారని, వారు ఎవరికీ ఎక్కువ సమయాన్ని కేటాయించలేరని వివరణ ఇచ్చారు. తాజాగా జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్, కుటుంబం మరియు డేటింగ్ లాంటి పలు విషయాలపై జాన్వీ స్పందించారు.
మీరు ఎవరితో డేటింగ్ చేస్తారు? అని కరణ్ జోహార్ అడగ్గా.. ‘సినిమా వాళ్లతో మాత్రం అస్సలు డేటింగ్ చేయను. నేను డేటింగ్ చేసేవారికి నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని నాతో ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో పనిచేసే వారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ఎవరికీ సమయాన్ని కేటాయించలేరు. ఒకే వృత్తిలో ఉంటే డేటింగ్ చేయడం కష్టం. అందుకే సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’ అని జాన్వీ కపూర్ చెప్పారు.
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
Also Read: Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకుపోయిన పడవ.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
ప్రస్తుతం జాన్వీ కపూర్ మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలకు ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందని, కాలేజీ రోజుల నుంచే వీరి ప్రేమాయణం సాగుతుందట. జాన్వీ, పహారియా కలిసి పలు కార్యక్రమాలకు హాజరైన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఇక ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లోకి జాన్వీ అడుగుపెట్టనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?