Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల కోసం విరవ గ్రామస్తులు ప్రయత్నిస్తుండగా, మట్టి తరలింపు మాత్రం విరవాడకు చెందిన ఇటుక బట్టి యజమానుల పేరుతో సాగుతోందన్న అభ్యంతరం లేచింది.
Read Also: French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ నేపథ్యంలో, అనుమతుల కోసం కష్టపడింది మేమే, కానీ మట్టిని తరలించేది మాత్రం మీరు ఎలా? అంటూ మాజీ ఎంపిపి రాంబాబు, విరవ గ్రామానికి చెందిన జనసేన నాయకులతో కలిసి వచ్చి విరవాడ బట్టి యజమానులను నిలదీశారు. దీనికి ప్రతిస్పందనగా, మా ఊరి చెరువులో మట్టి తవ్వడానికి మీకు హక్కుందా? అంటూ విరవాడ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?
ఇక ఈ వివాదం వాగ్వాదాన్ని దాటి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాత రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదులతో పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పిఠాపురం రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి ఉన్న అనుమతులు, తవ్వకాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!