NTV Telugu Site icon

Pawan Kalyan: కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఇంటికి పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌, కేంద్రమంత్రి మురళీధరన్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు. మురళీధరన్‌తో కలిసి పవన్‌ టిఫిన్‌ చేశారు. ఈ మేరకు బీజేపీ ఏపీ శాఖ ట్వీట్‌ చేస్తూ ఫొటోలను షేర్‌ చేసింది. బీజేపీతో పొత్తు, 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై మురళీధరన్‌తో పవన్‌ చర్చించినట్లు తెలిపింది. రాష్ట్ర అభివృద్ధిని ఇది దోహద పడుతుందని పేర్కొంది.

Also Read: Minister Amarnath: పురంధేశ్వరి కామెంట్స్‌పై మంత్రి అమర్‌నాథ్ కౌంటర్

ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలో చర్చ జరిగిందన్నారు పవన్‌ కళ్యాణ్. దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదన్నారు. మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని సమాధానం ఇచ్చారు.

Show comments