Pawan Kalyan: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం చెందడం ఆవేదన కలిగించిందన్న ఆయన.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పేద కుటుంబాలకు చెందిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని.. తగినంత నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసిన పవన్.. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గోరంట్ల ప్రాంతానికి చెందిన వలస కూలీలు ఉపాధి కోసం కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం జరగడం.. అందులో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే.. మన రాష్ట్రానికి చెందిన వారు.. పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: Minister Jagadish Reddy: ఎవరెన్ని కుట్రలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తాం..