Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..

  • జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా
  • గందరగోళం నేపథ్యంలో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు
Janagaon

Janagaon

జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గందరగోళం నేపథ్యంలో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు అనంతరం ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ, కౌన్సిలర్ల తీరుకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ ముందు బైఠాయించారు MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి,BRS కౌన్సిలర్లు.

Also Read:India Post GDS Recruitment 2026: గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్.. 28740 పోస్టులు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముస్లిం మహిళా కౌన్సిలర్ ను DCP భయపెడుతున్నాడు. DCP, ACP పైన డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తాం.. వెంటనే చర్య తీసుకోవాలని పల్లా డిమాండ్ చేశారు. ప్రశాంతంగా జరిగే చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ నేతలు కావాలని వాయిదా వేయించారని ఫైర్ అయ్యారు. అధికారులపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు MLA పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా చైర్మన్ అభ్యర్థిగా 22వ వార్డు కౌన్సిలర్ బాలామణి పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 18వ వార్డు సుగుణాకర్ పేరు ప్రతిపాదించారు.