JP Morgan: సార్వత్రిక ఎన్నికల వేళ మోడీపై జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, ప్రభుత్వ నిర్ణయాలను జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికన్లకు సూచనలు కూడా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమీ డిమోన్ కొనియాడారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలను మెచ్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. వాటిలో కొన్నింటిని యూఎస్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sunita Williams: అంతరిక్ష యాత్రపై కీలక ప్రకటన.. ఈసారి ఎన్ని రోజులంటే..
Also Read
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
భారత నాయకుడి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారన్నది యూఎస్ అధికారులు ఆలోచించుకోవాలన్నారు. మోడీ అద్భుతమైన పనితీరు చూపారని.. 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని గుర్తుచేశారు. వారు మనతో వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు మనం వెళ్లి, ఉపన్యాసం ఇస్తామన్నారు. పనులు ఎలా చేయాలో పాఠాలు చెబుతాం కానీ.. భారత్‌లో అద్భుతమైన విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉన్నాయని కొనియాడారు. అలాగే గతంలో వారికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉండేవని.. అవి అవినీతికి దారితీసేవన్నారు. ఆ సంక్లిష్టతను బ్రేక్ చేసి.. పన్ను వ్యవస్థను సంస్కరించారన్నారు. భారత్‌లో ప్రతీ పౌరుడిని గుర్తించే ఆధార్‌వ్యవస్థ ఉందన్నారు. 700 మిలియన్ల బ్యాంకు ఖాతాలున్నాయని.. సానుకూల మార్పు దిశగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. అలాంటి వైఖరిని మన నేతలు పాటించాల్సిన అవసరం కాస్త ఎక్కువగానే ఉందని అమెరికన్లను ఉద్దేశించి జేమీ డిమోన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగించిన ప్రసంగాన్ని ఎక్స్‌లో కేంద్రమంత్రి పీయూస్ గోయల్ పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Chandrashekar Rao: దద్దమ్మలకు దమ్ములేక పంటలు ఎండబెట్టారు
Modi has done an unbelievable job in India: Jamie Dimon, CEO of JPMorgan Chase & Co. pic.twitter.com/hGFsDL7m0C
— Piyush Goyal (@PiyushGoyal) April 24, 2024
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!