Jallikattu Tragedy: తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఈ ఘటన జరిగింది. పోటీల సందర్భంగా అదుపు తప్పిన ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, 76 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పండుగ వాతావరణంలో ఆనందంగా సాగాల్సిన జల్లికట్టు పోటీలు విషాదంగా మారడం స్థానికులను కలచివేసింది.
Read Also: Israel Iran War: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారా?.. తెలుగువారి కోసం హెల్ప్ లైన్..