Jai Hanuman Begins : జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్..ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి ట్రెండింగ్లో నిలుస్తుంది. రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది.ఈ మూవీ ఎండింగ్ లో హనుమాన్ కు సీక్వెల్ ఉన్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాదు టైటిల్ జై హనుమాన్ అని కూడా అప్పుడే రివీల్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ సీక్వెల్ పై మరింత బజ్ నెలకొంది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ స్పెషల్ డేకు ప్రశాంత్ వర్మ మూవీ లవర్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. హనుమాన్ మూవీ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీ పై క్రేజి అప్డేట్ ను ఇచ్చారు.జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు ప్రశాంత్ వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్ ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుందన్నారు. “హనుమాన్ పై అపారమైన ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అందరికి కృతజ్ఞుడిని. నా మాటను నిలబెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాను. చెప్పినట్టుగానే జై హనుమాన్ మూవీని 2025లో రిలీజ్ చేస్తాం. అయోధ్య రామమందిరం సందర్భంగా జై హనుమాన్ పనులను ప్రారంభించాం.మూవీని మొదలు పెట్టడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నా” అని పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఓవర్సీస్ ఆడియన్స్ కి హనుమాన్ మేకర్స్ ఆ బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే..యూఎస్ లోని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని మేకర్స్ ప్రకటింటారు. దీంతో అక్కడ హనుమాన్ మూవీ ప్రదర్శింపబడుతోన్న 11 థియేటర్లలో జనవరి 22 సోమవారం రోజున మేకర్స్ ఈ టికెట్ ధరలను తగ్గించి ఆడియన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Also Read
With gratitude for the immense love and support showered upon #HanuMan from audiences across the globe, I stand at the threshold of a new journey by making a promise to myself! #JaiHanuman Pre-Production Begins on the auspicious day of #RamMandirPranPrathistha 🙏@ThePVCU pic.twitter.com/wcexuH6KFH
— Prasanth Varma (@PrasanthVarma) January 22, 2024
తాజావార్తలు
-
Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్‌కి వంద మంది
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
-
Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..