టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ”హనుమాన్” మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని భాషలలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది.హనుమాన్ మూవీ థియేటర్స్ లోనే కాకుండా ఓటిటిలో కూడా అదరగొట్టింది.అలాగే ఏప్రిల్ 28 న హనుమాన్ మూవీ టీవీ ప్రేక్షకుల కోసం టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయింది.ఇదిలా ఉంటే హనుమాన్ మూవీతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడీ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ జనవరిలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా జై హనుమాన్ సినిమాను ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..ఈ పోస్టర్ లో ఓ ఎత్తయిన పర్వతం పై చేతిలో గదతో హనుమంతుడు నిల్చొని వుండగా గాల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఓ డ్రాగన్ వస్తున్నట్లుగా ఈ పోస్టర్ ను మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ లో తీసుకురానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.ఈ సారి జై హనుమాన్ మూవీలో డ్రాగన్స్ తో ప్రశాంత్ వర్మ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది . జై హనుమాన్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ కంటే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ సూపర్ హీరోల సినిమాలు 12 తీయనున్నట్లు గతంలోనే ప్రకటించాడు .హనుమాన్ మూవీ తరువాత మరో సూపర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ సినిమాను మొదలు పెట్టనున్నాడు .