Site icon NTV Telugu

Jagga Reddy : కేసీఆర్‌కు ఈటల క్లీన్‌చిట్.. బీజేపీ స్టాండ్‌ కూడా ఇదేనా..?

Jaggareddy

Jaggareddy

Jagga Reddy : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ మునుపటి నుండి స్పష్టమైన స్థానం తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని జగమెరిగిన సత్యమని, అప్పట్లో ఈటల రాజేందర్‌ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల కమిషన్ ముందు కేసీఆర్ అవినీతి చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారని, అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ఇంకా స్పందించలేదన్నారు. అదే బీజేపీ అధికారిక వైఖరా అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఈటల మాటలు చూస్తుంటే అంతర్గతంగా ఏదైనా ఒప్పందం జరిగిందా అన్న అనుమానం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి

ఒకప్పుడు BRS‌ను బహిరంగంగా విమర్శించిన ఈటల ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కేసీఆర్‌పై డైలాగులు వేశారు కానీ కమిషన్ ముందు మాత్రం వెనక్కి తగ్గారు అని ఆయన మండిపడ్డారు. ఈటల మాటలకు మీరు మద్దతు ఇస్తారా? ఖండిస్తారా? బీజేపీ అధికారికంగా ఏమంటుంది చెప్పాలి. లేకపోతే ప్రజలు మీ పార్టీ విధానాన్ని ఈటల వాదనగా భావిస్తారు అని హెచ్చరించారు.

Exit mobile version