Jana Reddy : బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని, రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా గాంధీని ఒప్పించడంలో నా పాత్ర ముఖ్యమైనదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, కేసిఆర్ మాటలు ప్రజలు విశ్వసించట్లేదన్నారు జగ్గారెడ్డి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని ప్రశ్నించారు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్‌లో మొదటి ర్యాంక్ అని ఆయన అన్నారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడే.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడే.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!