YS Jagan: సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు.