Site icon NTV Telugu

Jagadish Reddy : ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు

Jagadish Reddy

Jagadish Reddy

అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లలో జాప్యం సహించేదిలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : Woman In Hijab Harassed: హిందూ యువకుడితో తిరుగుతోందని హిజాబ్ ధరించిన యువతికి వేధింపులు..

అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలు యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు అదనపు అధికారులతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు, ధాన్యం కొనుగొళ్లపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల వద్దకు వచ్చి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి గౌరవం పెరిగింది కేసీఆర్ వల్లే అని జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడున్న వ్యవసాయ ప్రోత్సాహాలు దేశంలో ఎక్కడాలేవని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పండించిన ప్రతి గింజా కొంటామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డ్

Exit mobile version