Jagadish Reddy : రైతు బంధు ఆపడానికి వీలు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్‌ఎస్ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు 2500 రూపాయల హామీ గురించి మాట్లాడం లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కమిటీలతో అవసరం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని, లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో దెబ్బతిన్నదని ఆయన అన్నారు. వీధి కుక్కలు జనం పై దాడి చేస్తున్నాయి …చైన్ స్నాచర్ల సంఖ్య పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా ఒక్క పనిని మొదలు పెట్టలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతోన్న విద్యుత్ కమీషన్ నుండి నాకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమీషన్‌కు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుండి కమీషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..