Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Import Duty Cuts on Edible Oils: ఆయిల్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుండగా.. వారికి శుభవార్త చెప్పింది కేంద్రం.. పండుగ సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా ముడి, శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 24, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.. అంటే ఇవాళ్టి నుంచే అమలు కానుంది.. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనెపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్ నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించారు. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనెపై సుంకాన్ని 10 శాతం నుంచి పూర్తిగా ఎత్తివేయగా, శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు.
ప్రాథమిక కస్టమ్స్ సుంకంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్‌లు కూడా వర్తిస్తాయి. తాజా మార్పుల తర్వాత ముడి పామాయిల్, సోయాబీన్ నూనెపై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 16.5 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గనుంది. గత ఏడాది కాలంలో భారత్‌లో కూరగాయల నూనెల ధరలు దాదాపు 20 శాతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పండుగల సమయంలో స్వీట్లు, స్నాక్స్, వేయించిన పదార్థాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో దిగుమతి వ్యయం తగ్గడం ద్వారా దేశీయ ధరలపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే తగ్గిన దిగుమతి వ్యయం ఎంతవరకు వినియోగదారులకు చేరుతుందనేది సరఫరా గొలుసుపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
భారత్ తన కూరగాయల నూనె అవసరాల్లో దాదాపు మూడింట రెండు వంతులను దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలను ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా సుంకాల తగ్గింపుతో రిఫైనర్లకు దిగుమతులు పెంచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పొద్దుతిరుగుడు నూనె ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని పతంజలి ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ ఆచార్య రాయిటర్స్‌తో పేర్కొన్నారు. ఇది రిఫైనర్లకు మరింత ఆకర్షణీయంగా మారడంతో సోయాబీన్, పామాయిల్‌తో పోలిస్తే పొద్దుతిరుగుడు నూనెకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరి, ఇది వంటె నూనెల వినియోగదారులకు ఏ మేరకు ఊరట కలిపిస్తుందో వేచి చూడాలి..
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!