స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Aslo Read: KKR vs SRH: 120 పరుగులకే ఆలౌట్.. హ్యాట్రిక్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు భాస్కర్ జాక్ కథను చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది. భాస్కర్ చేసే రెగ్యులర్ జానర్ కాకుండా కొత్త జానర్ లో ఈ సినిమా ఉంటుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. జాక్ అంతకు మించి ఉంటుంది. టిల్లు అనేది కారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో కారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. జాక్ ఐడియానే అద్భుతంగా ఉంటుంది. ఆ ఐడియా నుంచి వచ్చిన సీక్వెన్స్ ఇంకా బాగుంటాయి. భాస్కర్ ఈ సినిమా కోసం దగ్గరదగ్గరగా రెండేళ్లు పని చేశారు. రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది. జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. జాక్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.