Itel S24 Launch and Price in India: ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ ఉండే ఫోన్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐటెల్’ సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే ‘ఐటెల్ ఎస్24’. ఈ ఫోన్ మంగళవారం (ఏప్రిల్ 23) భారతదేశంలో విడుదలైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటెల్ ఎస్24 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+128GB స్టోరేజ్ ధర రూ.10,999గా ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఐటెల్ ఎస్24ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే రూ.999 విలువగల ఐటెల్ 42 స్మార్ట్ వాచ్‌ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. ఇది స్టార్రి బ్లాక్, డాన్ వైట్ రంగులో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతానికి 8GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియెంట్ మాత్రమే ఉంది.
ఐటెల్ ఎస్24 స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 720×1,612 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ ఓఎస్ 13పై పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ91 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇందులో అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్ రౌండ్ షేప్‌లో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.