Jay Shah React on Virat Kohli Missed England Tests: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కీలక టెస్ట్ సీరీస్, అందులోనూ సుదీర్ఘ సిరీస్ అయినా విరాట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. విరాట్ ఉన్నపళంగా ఇన్ని రోజులు జట్టుకు ఎందుకు దూరమయ్యాడు అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ దూరం కావడాన్ని బీసీసీఐ సమర్థించింది. కోహ్లీ అకారణంగా సెలవులు తీసుకోడని అతడికి మద్దతుగా నిలిచింది.
బుధవారం రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి ‘నిరంజన్ షా’ మైదానంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జై షా.. విరాట్ కోహ్లీ సెలవులు తీసుకోవడంపై స్పందించాడు. ‘ఏ ఆటగాడు అయినా 15 ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగత సెలవు తీసుకోకపోతే వాటిని అడిగి వాడుకోవడం అతడి హక్కు. విరాట్ కోహ్లీ కారణం లేకుండా వ్యక్తిగత సెలవులు అస్సలు తీసుకోడు. అతడు ఆ రకం కాదు. మేం మా ఆటగాళ్లను నమ్ముతాం. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటాం’ అని జై షా చెప్పాడు.
Also Read: Motorola G04 Launch: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర 7 వేలు మాత్రమే!
రోహిత్ శర్మ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. దాంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడుతాడా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. అయితే విరాట్ కోహ్లీ పొట్టి టోర్నీలో ఉంటాడా? అనే విషయాన్ని మాత్రం జై షా చెప్పలేదు. విరాట్ గురించి అడగ్గా.. అతడి గురించి తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానం చెప్పకుండా దాటవేశాడు. అయితే ఫుల్ ఫామ్ మీదున్న కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడనున్నాడు. ఈ కార్యక్రమంలో జై షాతో పాటుగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాగొన్నారు.