Motorola G04 Launch: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర 7 వేలు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G04 Smartphone Launched in India With Rs 6,999: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరోలా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ‘మోటో జీ04’ పేరుతో కంపెనీ గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లో మోటో జీ04 అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభం అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.
Moto G04 Price:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 22 నుంచి మొదలవనుండగా.. కొనుగోలుదారులు ట్రేడ్-ఇన్ డీల్స్‌పై రూ.750 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగు (కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్) ఎంపికలలో లభిస్తుంది.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
Moto G04 Specs:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది 1612 x 720p రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. యూనిసోక్ T606 ప్రాసెసర్ అమర్చారు. మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బరువు 178.8 గ్రాములు.
Also Read: Redmi A3 Price: భారత మార్కెట్‌లోకి రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
Moto G04 Battery and Camera:
మోటో జీ04 ఫోన్ వెనక 16ఎంపీ ప్రధాన కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ ఇచ్చారు. వీడియోకాల్స్, సెల్ఫీ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..