ISRO: ఇస్రో మరో ఘనత.. ‘పుష్పక విమానం’ ప్రయోగం సక్సెస్
- మరో అద్భుతమైన ఘనత సాధించిన ఇస్రో
- మూడో సారి సురక్షితంగా పుష్పక్ రాకెట్ ల్యాండింగ్
- అధికారికంగా వెల్లడించిన ఇస్రో చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్) నుంచి ఎస్యూవీ తరహా రాకెట్‌ను ప్రయోగించారు. గాలిలోకి ఎగిరిన తర్వాత రాకెట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది. ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు వెల్లడించారు.
Read Also :Kirrak Boys Vs Khiladi Girls :అనసూయ షోలో ఈ విప్పుకోవడాలు ఏంట్రా?
‘ఇస్రో మరో ఘనత సాధించింది.. రీయూజబుల్ లాంఛింగ్ వెహికిల్ టెక్నాలజీతో తయారు చేసిన పుష్పక్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించాం. గాల్లో నుంచి వదిలిన సమయంలో నిర్దేశించిన విధంగానే రన్‌వైపే సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత వాయుసేన హెలికాప్టర్ చినూక్ ద్వారా పైకి తీసుకెళ్లి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలి పెట్టింది. ఈ సమయంలో 4 కి.మీ దూరం నుంచి పుష్పక్ రాకెట్ రన్‌వే వైపు దూసుకొచ్చింది. రేంజ్‌ని కూడా తనకు తానుగానే సరిచూసుకుని ఆ తరవాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో ఆగిపోయింది.’ అంటూ ఇస్రో పేర్కొంది.
Read Also :Amaravati Farmers : కాలినడకన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి బయలుదేరిన రాజధాని రైతులు..
Also Read
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
RLV-Lexలో బహుళ-సెన్సార్ ఫ్యూజన్ ఉపయోగించారు. ఇందులో ఇనర్షియల్ సెన్సార్, రాడార్ ఆల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఈ మిషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని సహకార ప్రయత్నం, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్నాయి. ఈ మిషన్‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరియల్ డెలివరీ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ కింద ప్రాంతీయ మిలిటరీ ఎయిర్‌వర్థినెస్ సెంటర్లు, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓస్ట్రోల్ పార్ట్నర్ కార్పొరేషన్ సమన్వయం చేస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి గణనీయమైన మద్దతు లభించింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Prabhas : ‘ఫౌజీ’ టీజర్ లోడింగ్.. సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్?
-
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
-
Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
-
Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!