Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక

  • ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు ఇజ్రాయిల్ హెచ్చరిక.
  • ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుంటే ఖమేనీ గతే అంటూ కాట్జ్ వ్యాఖ్యలు.
  • ట్రంప్‌పై ప్రతీకారం వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయిల్.
  • ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం.
Iran War

Iran War

Israel: మాజీ సుప్రీంలీడర్ అలతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ అంత్యక్రియల నెపంతో తన శక్తిని ప్రదర్శిస్తున్న ఇరాన్‌ను హెచ్చరించింది. భవిష్యత్తులో ఇజ్రాయిల్‌కు హాని తలపెట్టాలనే చూసే ఏ ఇరాన్ నాయకుడికైన అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ఇజ్రాయిల్‌ను నాశనం చేయడానికి ప్లాన్‌ను ఖమేనీ ప్రారంభించి, దానికి నేతృత్వం వహించినందుకే ఇజ్రాయిల్ అతడిని హతం చేసిందని కాట్జ్ అన్నారు. “చంపడానికి వచ్చినవాడు హతమయ్యాడు. ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ప్రణాళికను మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నించే ఏ ఇరాన్ నాయకుడైనా అడ్డుకోబడతాడు” అని ఆయన స్పష్టం చేశారు. అంత్యక్రియలకు హాజరైనవారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని, ఇది ఖమేనీ పాలన నిజస్వరూపమని అన్నారు. ఏ సమయంలోనైనా, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొని, తనను తాను ఒంటరిగా రక్షించుకోవడానికి మరోసారి ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని చెప్పారు.