Pakistan: పాక్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్ హత్య.
- మహిళ అపహరణ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో కాల్పులు.
- ఘటన అనంతరం నిందితుడు పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్‌ను గుర్తుతెలియని దండగుడు కాల్చి చంపాడు. ఆదివారం ఇస్లామాబాద్‌లోని షాహీన్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఒక మహిళను గుర్తుతెలియని యువకుడు కారులో బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా, అటుగా వెళ్తున్న అసిమ్ తారిఖ్ కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడు అతడిని తుపాకీతో కాల్చి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుల్లెట్ గాయంతో తారిఖ్ అక్కడిక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని పాక్ వైమానిక దళ ఆస్పత్రికి తరలించారు.
నిమ్రాగా గుర్తించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాక్ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం, నిందితుడు మహిళకు తెలిసిన సహోద్యోగే అని, అతడి పేరు సాద్ అని గుర్తించారు. తనకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి, దారి మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మహిళ ఆరోపించింది. ఫెడరల్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం తెలిపారు. నిందితుడి కోసం ఇస్లామాబాద్ వ్యాప్తంగా గాలిస్తున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ఈ ఘటనకు ముందు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని మొహమండ్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు పోలీసు పెట్రోలింగ్‌పై దాడి చేయడంతో, ఒక అదనపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా ఇద్దరు పాకిస్తానీ పోలీసు సిబ్బంది మరణించారని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?