Israel Offer: నాలుగు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్‌కు ఇండియా ఓకే చెప్తే.. ఇప్పుడు పాకిస్థాన్ అచ్చంగా కోరలు పీకేసిన పాములాగా మారేది. ఇది నిజం.. ఆ సమయంలో భారతదేశం – పాకిస్థాన్ మధ్య అప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో పాకిస్థాన్ అణ్వస్త్ర శక్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ విషయం భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌కు కూడా తెలుసు. అప్పుడే ఇజ్రాయెల్.. ఇండియాకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కు ముందు భారత్ ఒప్పుకుంది.. కానీ.. ఆ కానీ కారణంగానే నేడు పాక్ బతకడంతో పాటు ఉగ్రముకలకు నిలయంగా మారింది..
READ ALSO: వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన పాకిస్థాన్‌కు ఇజ్రాయెల్ సమాధానం చెప్పిన విధానం 1980ల కథను మరోసారి గుర్తుకు తెచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. ఇజ్రాయెల్ భారతదేశానికి కావాలంటే పాకిస్థాన్‌పై బాంబులు వేసి దాని కథను ముగించవచ్చని ఆఫర్ చేసింది. అప్పుడు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం ముందు ఈ ఆఫర్‌కు చాలా వరకు ఓకే చెప్పేలా కనిపించింది. కానీ చివరి క్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోవడంతో పాక్ నేడు బుసలు కొట్టగలుగుతుంది.
‘డిసెప్షన్’లో నాటి కథ..
ఆడ్రియన్ లెవీ, కేథరీన్ స్కాట్ క్లార్క్ రాసిన డిసెప్షన్ అనే పుస్తకంలో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ కథ గురించి ప్రస్తావించారు. 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని ముప్పుగా చూసింది. ఇరాన్ కూడా ఆ రోజుల్లో అణు కార్యక్రమం ప్రారంభిస్తే దానిపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిది. అటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి.. 1984లో పాక్‌స్థాన్‌పై దాడికి భారతదేశానికి జాయింట్ ఆపరేషన్‌ను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ F-16, F-15 యుద్ధ విమానాలు భారతదేశంలోని జామ్‌నగర్ వైమానిక స్థావరం నుంచి ఇంధనం నింపిన తర్వాత పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై బాంబు దాడి చేసి దానిని నాశనం చేయాలనేది ప్లాన్. ఇజ్రాయెల్ విమానాలకు భారత జాగ్వార్ విమానాలు సహాయం చేయాలి.
అంగీకరించినట్లే ఉండి.. తర్వాత
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ ప్లాన్‌కు ముందుగా అంగీకరించారు. కానీ తరువాత అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, ముఖ్యంగా అమెరికా, పాకిస్థాన్‌తో నాల్గవ యుద్ధం భయం కారణంగా వెనక్కి తగ్గారు. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌పై దాడి చేసిన విధంగానే పాకిస్థాన్‌పై కూడా దాడి చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంది. ఆదే సమయంలో ఇందిరా గాంధీ హత్యకు గురై, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా ఆపేశారు.
పాక్‌పై ఇజ్రాయెల్ విమర్శలు కొత్త కాదు..
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న అంశాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. పాక్ నియంత జియా-ఉల్-హక్ నాయకత్వంలో ఆ దేశం అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ అనేకసార్లు హెచ్చరించింది. 1979లో దీని గురించి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు కూడా ఒక లేఖ రాసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ భారతదేశానికి పాక్‌పై దాడికి ప్రతిపాదన చేసింది. కానీ భారతదేశంలోని అంతర్గత అశాంతి కారణంగా నాటి ప్రభుత్వం యుద్ధం కోరుకోలేదు. దీనితో పాటు పాకిస్థాన్‌కు అమెరికా నుంచి మద్దతు లభించడం, అగ్రరాజ్యం పాక్‌కు F-16 విమానాలను ఇవ్వడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గడం మంచిదని భారతదేశం భావించింది.