Holi In Israel : హిందూ మsg హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. నేడు ఇతర మతాల వారు కూడా హోలీని జరుపుకుని హిందువులతో కలసి రంగులు ఆడుకుంటున్నారు. భారతదేశంలో హోలీని గొప్పగా జరుపుకోవడమే కాదు, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ప్రజలు హోలీని జరుపుకుంటున్నారు. ఇజ్రాయెల్‌లో ప్రజలు హోలీ జరుపుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో టెల్ అవీవ్ వీధుల్లో ప్రజలు హోలీ ఆడటం చూడవచ్చు. టెల్ అవీవ్ యాఫో మున్సిపాలిటీతో కలిసి భారత రాయబార కార్యాలయం హోలీ, పూరీమ్ పండుగల సందర్భంగా ఫ్లీ మార్కెట్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించిందని ఇజ్రాయెల్‌లోని ఇండియన్ మిషన్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. హోలీ వేడుకలో సుమారు రెండు వేల మంది భారతీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, భారతీయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.
టెల్ అవీవ్‌లో హోలీ వేడుక
యాఫోలో జరిగిన హోలీ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని భారతీయ సంస్కృతిని నిశితంగా అర్థం చేసుకున్నారు. ఫ్లీ మార్కెట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ మిషన్ డిప్యూటీ హెడ్ రాజీవ్ బోడ్వాడే, టెల్ అవీవ్ యాఫో మున్సిపాలిటీకి చెందిన మిష్లామా లేయాఫో సీఈవో రఫీ షుషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయులు హోలీ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.
In association with #TelAvivYafo Municipality, the Embassy of India celebrated ‘India in Flea Market’ event on the occasion of #Holi and #Purim festivals. Over 2000 visitors enjoyed Indian dance, classical music, Indian dresses, henna, calligraphy in Hindi & Indian Chai.
🇮🇳🤝🇮🇱 pic.twitter.com/VbWtz4ZsGM— India in Israel (@indemtel) March 24, 2024
పూరీమ్, హోలీ కలిసి
ఈ సంవత్సరం యూదుల పండుగలు పూరీమ్, హోలీ ఒకే సమయంలో వచ్చాయి. దీని కారణంగా ఇజ్రాయెల్, భారతీయ ప్రజలు రెండు పండుగలను కలిసి జరుపుకుంటారు. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో బైబిల్ పుస్తకం ఎస్తేర్‌లో వ్రాయబడిన పర్షియన్ యూదులను రక్షించే కథను పూరీమ్ మనకు గుర్తు చేస్తుంది. పర్షియన్ రాజు అహష్వేరోషు, అతని యూదు భార్య ఎస్తేరు పాలనలో రాజు అత్యున్నత అధికారి హామాన్, రాజ్యంలో ఉన్న యూదులందరినీ చంపాలని ప్లాన్ చేశాడు. దీనిని యూదులు ధైర్యంతో నాశనం చేశారు.