SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Players Dance Video Goes Viral: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మ డాన్స్ మాస్టర్ లుగా మారి తమ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్టెప్స్ నేర్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో ట్రావిస్ హెడ్ కెమెరా ముందు నిలబడి షూట్లో పాల్గొంటుండగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కెమెరా వెనుక నుంచి డాన్స్ స్టెప్స్ చూపిస్తూ కనిపిస్తున్నారు. వారు చెప్పిన స్టెప్స్ ను ట్రావిస్ హెడ్ క్రమంగా ఫాలో అవుతూ డాన్స్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అభిషేక్ శర్మ తన మొబైల్ లో ఈ సరదా క్షణాలను రికార్డ్ చేయడం కూడా హైలైట్‌గా మారింది.
Also Read
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
Ishan Kishan and Abhishek Sharma turning choreographers as they teach Travis Head some dance moves during a recent Netflix shoot, teamwork isn’t just for the pitch🧡 pic.twitter.com/9j0s7mRYFo
— IshanFanAccount (@Ishanworld32) April 22, 2026
ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ వీడియోతో ఆటగాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్, సరదా వాతావరణం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక జట్టు ప్రదర్శన విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. చివరిగా ఢిల్లీ కాపిటల్స్ పై గెలిచి వరుసగా మూడు విజయాలు సాధించింది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 3 ఓటములతో +0.82 నెట్ రన్‌రేట్‌తో 8 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్లో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తూ టోర్నీలో టాప్ రన్ స్కోరర్స్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో పోటీ పడుతున్నారు.
Entertainers on and off the field 🤩🎬 https://t.co/oskbsAu8Om
— SunRisers Hyderabad (@SunRisers) April 22, 2026
తాజావార్తలు
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క